TET DSC TRT PSYCHOLOGY 2021 DEFENSIVE TACTICKS ౼ రక్షక తంత్రాలు

Spread the love

TET DSC TRT PSYCHOLOGY 2021 DEFENSIVE TACTICKS ౼ రక్షక తంత్రాలు

*సంఘర్షణలు ౼ కుంఠనాలు ౼ ఒత్తిడి ౼ మనో వ్యాకులత ౼ విషమయోజనం ౼ మానసిక రుగ్మత
*ఈ పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఫ్రాయిడ్
*సంఘర్షణల వల్ల కుంఠనాలు ఏర్పడతాయి. కుంఠనాల వల్ల ఒత్తిడి, ఒత్తిడి వల్ల మనో వ్యాకులత ఏర్పడుతుంది
*కుంఠనాల వల్ల ఏర్పడ్డ మనో వ్యాకులతను తగ్గించుకొనేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన, అచేతన ప్రక్రియలను రక్షక తంత్రాలు అంటారు
*ఇవి మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి
*వ్యక్తి ఆహాన్ని పరిరక్షిస్తాయి. కాని ఇందులో ఆత్మ వంచన భావన దాగి ఉన్నది

5)విస్తాపనం :

కోరికలను లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ గమ్యాన్ని మారుస్తాడు
ఉదా:

*అత్త మీది కోపం దుత్త మీద చూపించడం లాంటిది
*ఎదురింటావిడ మీది కోపాన్ని పిల్లల మీద చూపించడం
*నాయకుడి మీద కోపాన్ని ప్రతినాయకుడు విలన్ల మీద చూపించడం
*ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం

6)ప్రతి గమనం :
పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు పెద్దల వలె ఆలోచించి సమస్యా పరిష్కారం కానప్పుడు పిల్లలవలె ప్రవర్తించడం
ఉదా :

*ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లల్ని పట్టుకొని ఏడ్వడం
*పదే పదే పుట్టింటికి వెళ్లే నూతన వధువు
*రాత్రి పూట పక్కతడిపే యువకుడు
*రోడ్డు మీద వేగంగా వాహనాన్ని నడపడం

7)తదాత్మీకరణము :
ఒక వ్యక్తి ఇతరలలో కలిగిన అభిలషనీయమైన లక్షణాలను తమ మూర్తిమత్వంలో చేర్చుకోవడం
ఉదా :

*తాను ఓడిన తన మిత్రుడు గెలిచాడన్న అనుభూతిని పొందడం
*కండక్టర్ కొడుకు కలెక్టరు అయినపుడు కండక్టరు యొక్క అనుభూతి తదాత్మీకరణం

8)పరిహారము :
ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించనపుడు మరో రంగంలో రాణించడం. (ప్రత్యామ్నాయo ఎన్నుకోవడం)
ఉదా :

*చదువుపట్ల ఆశక్తిలేని రమణ మహర్షి గొప్ప తాత్వికుడుగా మారడం
*నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పించడం
*చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటలలో ప్రతిభ చూపించడం
*పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్ లో టీచర్ గా చేరడం
*అవిటి తనంతో బాధపడే హెల్లెన్ కెల్లర్ గొప్ప సంఘ సేవకురాలిగా కవయిత్రిగా రాణించడం

9)స్వైరకల్పనం :
పగటి కలలు కనడం. తీరని కోరికలను కలలలో సంతృప్తి చెందడం

10)నిరాకరించుట :
సహించలేని వాస్తవాన్ని నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం
ఉదా :

భార్య మరణ వార్త విన్న భర్త అది నిజం కాదని తోసి వేయడం

11)ఉపసంహరణ :
వ్యక్తి తనకు సంబంధించని పరిస్థితులకు దూరంగా ఉండటం
ఉదా : పేరంటాలకు వెళ్లే మహిళలు అక్కడ అవమానం జరుగుతుందని పేరంటాలకు పోకపోవడం

12)ఉదాత్తీకరణం :
ఉద్వేగాత్మకమైన / ఉద్వేగపూరితమైన ఆలోచనలను, నిర్మాణాత్మక క్రియలలో కేంద్రీకరించడం
ఉదా :

ప్రేయసి పై కవితలు రాసే ప్రేమికుడు గొప్ప కవిగాను, గొప్ప చిత్రకారుడుగాను మారడం జక్కన్న, అన్నమయ్య మరియు తులసీదాస్ మొదలైనవారు

insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *