AP GRAMA WARD SACHIVALAYAM GENERAL STUDIES & MENTAL ABILITY GRAND TEST (తెలుగు – కాoప్రిహెన్షన్) – 52
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కాంప్రహెన్షన్ - 1 ( 1 నుండి 5 ప్రశ్నలు) సంస్కృతపదం "ఉపాసన" వాస్తవిక జ్ఞానం అన్న అర్థాన్నిస్తుంది. తైత్తిరీయోపనిషత్తును పరిచయం చేస్తూ శంకరాచార్యుల వారు ఉపనిషత్ శబ్దానికిదే అర్థం వివరించారు. మనిషి జ్ఞానం కోసం బాహ్యవస్తువుల మీద ఆధార పడుతారు. అంతర్మథనం ద్వారా వాటి నుంచి సత్యాన్ని గ్రహిస్తాడు. జనరంజకమైన ఈ ధ్యాన విధానాన్ని 'ఉపాసన'గా వ్యవహరిస్తారు. ధ్యానంలో వివిధ గుర్తులు ఉపయోగిస్తారు. వాటిని అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. వస్తువుల ఉనికి, మూలం గురించే మనిషి ధ్యానిస్తాడు. శూన్యంలోంచి సృష్టి జరిగిందని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. "ఉనికి" ముందు, ఇప్పుడు, తరువాత ఉంటుంది. శాస్త్ర విజ్ఞానంలోని "పరిణామ సిద్ధాంతాన్ని” బలపరిచే ఉపనిషత్తుల క్షీణత” సిద్ధాంతం కూడా అన్ని వస్తువులూ “ఉనికి” ప్రక్షేపకాలే అని, అన్నీ మూలానికి లేదా అసలు స్థితికి చేరుకోవాలనీ, అలా అదృశ్యమైన జడ స్థితికి 'చేరుకొన్నట్టుగా అంతకుముందు ఉన్నట్టుగా ముందు ఉండేట్టుగా ఉంటుందని భావించాలి. 1. తైత్తిరీయోపనిషత్తును పరిచయం చేస్తూ శంకరాచార్యులు ఉపనిషత్ శబ్దానికి వివరించిన అర్థం ?
#2. జ్ఞానంకోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడే మనిషి దీని ద్వారా వాటి నుంచి సత్యం గ్రహిస్తాడు
#3. ధ్యానంలో వివిధ గుర్తులు ఉపయోగించడం ద్వారా తెలుసుకొనేది ?
#4. ఉపనిషత్తుల వివరణ ప్రకారం సృష్టి ఇందులోంచి జరిగింది.
#5. శాస్త్ర విజ్ఞానంలోని పరిణామ సిద్ధాంతాన్ని బలపరిచే ఉపనిషత్తుల సిద్ధాంతం ?
#6. కాంప్రహెన్షన్ - 2 (6 నుండి 7 ప్రశ్నలు) సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హాలసిరి శాతకర్ణి అనే శాతవాహనరాజు, అనేక ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి, సంకలించి ఈ పేరుతో క్రీ.శ. మొదటి శతాబ్దం ప్రథమ దశకంలో ఈ మహాకావ్యాన్ని లోకానికి అందించాడు. 6. 'గాథా సప్తశతి' ప్రత్యేకత ?
#7. 'మహాకావ్యం' అనే పదానికి విగ్రహవాక్యం ?
#8. కాంప్రహెన్షన్ - 3 (8 నుండి 12 ప్రశ్నలు) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఇక్కడి ప్రాంత ఏ ఆకాంక్షను సాకారం చేసుకున్నారు. ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత రాష్ట్రం స్వయం పాలనలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కృషి చేసిన వారిని ఒక్కోవిధంగా గౌరవించింది. తెలంగాణ సమాజం. B.S. వెంకట్రావు హైద్రాబాదు అంబేద్కర్, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ పితామహుడు, తెలంగాణ బెబ్బులి, సాయుధ పోరాట పితగా-రావి నారాయణరెడ్డి. దక్కన్ సర్దార్, సరిహద్దు గాంధీ - జమలాపురం కేశవరావు గారు. తెలంగాణ టైగర్ నర్సింగ్లు, తెలంగాణ పటేల్- బొమ్మకంటి సత్యనారాయణ, తెలంగాణ శివాజీ - సర్వాయి పాపన్న, తెలంగాణ కాటన్ నవాబ్ అలీ నవాజ్ జైన్ బహదూర్. తెలంగాణ బాబాయి కొండా వెంకట రంగారెడ్డి, తెలంగాణ జాతిపిత - ఆచార్య జయశంకర్, హైద్రాబాద్ లయన్ పండిట్ నరేంద్రజీ, - హైదరాబాద్ ప్రకాశం స్వామి రామానంద తీర్థ, హైదరాబాద్ - భగత్ సింగ్ - నారాయణరావ్ పవార్, మిస్టర్ తెలంగాణ ఆచార్య కేశవరావు జాదవ్ వంటి విశిష్టమైన వ్యక్తుల పేర్లతో బిరుదులు సంపాదించుకుని వారి కృషికి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మలిదశ ఉద్యమంలో భాగంగా 2011 మార్చి - 1. నాడు. పల్లె పల్లె పట్టాలపైకి, 2011 ఫిబ్రవరి 21 నాడు 16 రోజులు T.J.A.C. సహాయ నిరాకరణ, 2012 సెప్టెంబర్ - 30 తెలంగాణ మార్చ్ సాగరహారం నిర్వహించారు. 2013 మార్చి 21 శంషాబాద్ నుండి అలంపూర్ వరకు 200 కిలోమీటర్ల దూరం వరకు “సదక్ బంద్" నిర్వహించారు. ఇలా 60 ఏళ్ళనుండి ఆశయం, ఆవేశం అలసిపోలేదు. 8. భారతదేశ చిత్రపటంలో తెలంగాణ ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది?
#9. కొండా వెంకట రంగారెడ్డి ఇలా ప్రసిద్ధి పొందారు?
#10. 2013 మార్చి 21 నాటి ప్రత్యేకత ?
#11. 'తెలంగాణ బెబ్బులి' గా పేరుగాంచినది ?
#12. స్వామి రామానంద తీర్థ నారాయణ రావ్ పవార్ ?
#13. కాంప్రహెన్షన్ 4 (13 నుండి 17 ప్రశ్నలు) ఇంతట్ల పాలమూరి వెళ్ళి ఎచ్చమ్మ రానే వొచ్చింది. ఉంగరాలు తిరిగిన ఎంటికలు కండ్లమీద గుత్తులోలె వాల్తుంటే, పొట్టి జడేసుకొని ఒంటి ముత్యం ఊగులాడెకి లావర్పూలు చెవులకు వెళ్ళడు ఎఱ్ఱరాళ్ళ పత్యం గలిపి గుచ్చిన గోధుమాణి దండేసుకొని, కిలకిలమను కంటొచ్చింది. ఈ పిల్ల రాంగనే ఇల్లు పచ్చతోరణాలు గట్టినట్లు బంతిపూలు పూసినట్లు వెన్నెల గాసినట్లు కళకళలాడింది. పిల్ల నిజానికి సక్కని చెక్కడ బొమ్మకాదు. అయినా... ఆ పిల్ల మొగంలో కళ ఏందోగని ఒక్కసారి జూస్తే మళ్ళా మళ్ళా సూడ బుద్ధితది. అలిగినప్పుడు కుడిదిక్కు సొట్టలు పడే దాని పాల చెంపలు ముద్దులు గుమ్మరిచ్చ బుధ్ధాతవి. 13. ఈ వచనం తెలంగాణా మాండలికానికి పట్టం కట్టినట్లుంది' ఈ రచయిత ఎవరు ?
#14. ఎచ్చమ్మ (యశోద) ఎక్కడికి వచ్చింది ?
#15. ఎచ్చమ్మ వెంట్రుకలు ఎలా ఉన్నవి ?
#16. 'చెక్కడపు బొమ్మ' విడదీయుటగా
#17. రాగానే ఇల్లు ఎలా ఉంది ?
#18. కాంప్రహెన్షన్ 5 (18 నుండి 22 ప్రశ్నలు) 1964లో కొఠారీ కమీషన్, ప్రతి విద్యార్థి ప్రాంతీయ భాషతో పాటు విధిగా హిందీ, ఇంగ్లీషు భాషలను అభ్యసించాలని ప్రతిపాదించింది. 1978లో NCERT వారు రూపొందించిన 10 + 2 + 3 విద్యా ప్రణాళికలో కూడా త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు. 1986లో జాతీయ విద్యా విధానం (NPE-1986] కూడా త్రిభాషా సూత్రానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో 1. మాతృభాష లేదా ప్రాంతీయ భాష 2. జాతీయ భాష - హిందీ 3. అంతర్జాతీయ భాష - ఇంగ్లీషులను అభ్యసించాలని సూచించింది. సమైక్యతా భావనకు ముఖ్యమైన కారణం త్రిభాషా సూత్రం. ఏ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్రంలో "కూపస్థమండూకాలుగా” ఉంటే దేశం చిన్నాభిన్నమైపోతుంది. డా॥ విల్దియన్ అభిప్రాయం ప్రకారం బహుభాషాభ్యసనం విద్యార్ధి బుద్ధిని ఇనుమడింపచేసి, వాక్చాతుర్యాన్ని మెరుగుపరచి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసి సహృదయతను పెంపొందిస్తుంది. త్రిభాషా సూత్రాన్ని త్రికరణ శు ద్ధితో అమలుపరిస్తే దేశానికి ఎంతో మేలు చేకూరుతుంది. జాతీయ స్ఫూర్తిని పెంపొందింప జేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనదేశంలో ఒకటికన్నా ఎక్కువ భాషలలో ప్రావీణ్యం సంపాదించిన మేధావులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు పి.వి. నరసింహారావు 17 భాషలపై పట్టు సంపాదించి గొప్ప రాజనీతి తత్వవేత్తగా, బహుభాషా కోవిదుడుగా ప్రసిద్ధిగాంచారు. 18. N. C.E.R.T ని విస్తరించండి ?
#19. త్రిభాషా సూత్రాన్ని అమలు పర్చడం వల్ల విద్యార్థికి మేలు జరుగుతుందని చెప్పిన భాషావేత్త?
#20. "కూపస్థ మండూకం" అనేది ఏమిటి?
#21. త్రిభాషా సూత్రంలో అంతర్జాతీయ భాష ఏది ?
#22. కొఠారీ కమీషన్ జాతీయ విద్యా విధానం ?
#23. కాంప్రెహెన్సన్ 6 (23 నుండి 27 ప్రశ్నలు) శ్రీ కె.ఆర్. ఆమోస్ ఆధ్వర్యంలో టి.ఎన్.జి.ఒ యూనియన్ 1968 జూలై 10న తెలంగాణ హామీల దినం నిర్వహించింది. ఉద్యోగుల రక్షణను ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించడం, ముల్కీ నిబంధనలను పక్కన పెట్టడం. కోర్టు తీర్పులను, కేంద్రప్రభుత్వ ఆదేశాలను, ఉత్తర్వులను అమలు చేయకపోవడం, బోగస్ ముల్కీ సర్టిఫికెట్లపై, ఇతరత్రా కారణాలతో తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో వేలాదిమంది ఆంధ్రా వారిని నియమించడం వంటి కారణాలతో T.N.GOలు తెలంగాణ పరిరక్షణ దినం ప్రారంభించారు. ఈ క్రమంలో జూలై 10, 1968న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో "తెలంగాణ హక్కుల దినం, సభలు నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నరలోపే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడవని నిర్ణయానికి వచ్చారు తెలంగాణ ప్రజలు. ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణను వేరుచేయమని -కోరుతూ భారత రాష్ట్రపతిని 1958లోనే తెలంగాణ మహాసభ విజ్ఞప్తి చేసింది. ఈ విధంగా తమిళ ప్రాంతం నుండి వేరుపడి తెలంగాణ ప్రాంతంపై కన్నేసిన ఆంధ్రా నాయకులు అనేక రకాలుగా తెలంగాణ సమాజాన్ని అన్యాయానికి గురి చేశారని చరిత్ర చెబుతుంది. ఒక సందర్భంలో చంద్రబాబునాయుడు గారు C.M.గా ఉన్నప్పుడు చరిత్ర చదవద్దు దాన్ని ఎత్తేస్తున్నాం అని ప్రకటించారు. ఈ ప్రకటనపై తెలంగాణ సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. చరిత్ర చదివితే తెలంగాణ చరిత్రకు సంబంధించిన వివరాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలుస్తాయి. అట్లా తెలిసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తారు అన్న ఆలోచనతో చంద్రబాబు చరిత్రను చులకన చేశారని మేధావుల సంఘం అభిప్రాయపడింది. 23. ఆంధ్రులు మొట్టమొదట ఏ రాష్ట్రం నుండి విడిపోయారు?
#24. తెలంగాణ హక్కుల పరిరక్షణ దినం ఎప్పుడు నిర్వహించారు (నిర్వహిస్తారు ?
#25. ఈ క్రింది వాటిలోంచి "స్థానికుడు" అనే అర్థాన్నిచ్చే పదాన్ని
#26. తెలంగాణను ఉమ్మడి రాష్ట్రం నుండి వేరుచేయమని 1958లోనే భారత రాష్ట్రపతికి తెలంగాణ మహాసభ విజ్ఞప్తి చేసింది. అప్పటి రాష్ట్రపతి ఎవరు ?
#27. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన ఎంత కాలంలోపు తెలంగాణ ప్రజలకు అభద్రతా భావం ఏర్పడింది ?
#28. 28. కాంప్రహెన్షన్ 7 (28 నుండి 30 ప్రశ్నలు) విద్యార్థుల వికాసం కేవలం ఉపాధ్యాయుల ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు. రేపటి తరాన్ని నిర్మించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్ర విడదీయలేనిది. బోధనాంశాల్లో శాస్త్రీయ శిక్షణ పొంది వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తన, ఆసక్తులకు సంబంధించి తల్లిదండ్రులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరము ఉంది. వర్తమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మానసిక వికాసం కోసం వారిలోని విద్యేతర కళలు, వ్యాయామం, ' వక్తృత్వం, నటన వంటి రంగాల్లో నైపుణ్యాలను వెలికి తీయడం ' కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇటీవలే "విద్యాంజలి" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వ పాఠశాలకు రప్పించి, విద్యార్థులకు శిక్షణ ఇప్పించటం విద్యాంజలి ప్రధాన లక్ష్యం. దశల వారీగా విస్తరింపచేసే ఈ కార్యక్రమాన్ని ముందుగా దేశంలో ఎంపిక చేసిన 21 రాష్ట్రాల్లోని 2,200 పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని సంకల్పించారు. ఈ ఏడాది 2016 డిసెంబరు నాటికి దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరింపచేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యాంజలిలో భాగస్వాములు కావాలన్న ఆసక్తి గలవారు ముందుగా తమ పేరును - “మైగవ్. ఇన్”లో నమోదు చేసుకొని సొంత ఖర్చుతో బోధనకు సిద్ధపడాలని పిలుపునిచ్చింది. "ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో సృజనాత్మకతకు పునాది వేయాలి. భవిష్యత్తులో విజయానికి అదే కీలకం”. A.P.J. అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ఒక గొప్ప శిష్యుడుగా, విశిష్ట గురువుగా, నిరాడంబర నాయకుడిగా, ప్రేరణశీలిగా జీవించాడు. వీలు దొరికినప్పుడల్లా వీరు విద్యార్థులతో ఎక్కువ కాలం గడిపేవారు. ఈ ఆసక్తిని గమనించిన U.N.O. కలాం పుట్టిన రోజైన అక్టోబర్ 15”ను "ప్రపంచ విద్యార్థుల దినోత్సవం"గా ప్రకటించింది. 28. "అంజలి" అంటే అర్థం ?
#29. ఈ పథకంలో భాగంగా మొదటి విడతలో ఎన్ని రాష్ట్రాలు, పాఠశాలల్లో ఎంపిక చేసింది ?
#30. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ?
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS