AP TET DSC 2021 MATHEMATICS (వ్యాపార గణితం ౼ బీజగణితం) TEST౼ 73

Spread the love

AP TET DSC 2021 MATHEMATICS (వ్యాపార గణితం ౼ బీజగణితం) TEST౼ 73

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఒక రెండంకెల సంఖ్యలో రెండు అంకెలమొత్తం 9 ఈ సంఖ్య నుండి 27ను తీసివేసిన సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. అయిన ఆ సంఖ్య ?

#2. రెండు ధనసంఖ్యల భేదము 36. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 4, అయిన అందులో చిన్నసంఖ్య ?

#3. సాధారణవడ్డీ అసలులో 25% కి సమానం మరియు వడ్డీరేటు కాలానికి సమానం అయిన వడ్డీరేటు ఎంత ?

#4. రూ.6400లకు సం౹౹నికి 7 1/2% వడ్డీరేటు చొప్పున 2సం౹౹ల కాలానికి చక్రవడ్డీ ?

#5. ఒక పనిని 'ఎ' 25 రోజుల్లోనూ, 'బి' 20 రోజుల్లోనూ చేస్తారు. మొదట 'ఎ' పనిని ప్రారంభించి 5 రోజుల తరువాత పనిని వదిలి వెళ్లెను. అయిన మిగిలిన పనిని 'బి' ఎన్ని రోజులలో చేస్తాడు ?

#6. 'K' యొక్క ఏ విలువకు 3x+4y+2=0 మరియు 9x+12y+k=0 మరియు 9x+12y+k=0 రేఖా సమీకరణాల జత ఏకీభవించే రేఖలు అవుతాయి ?

#7. ఒక తరగతిలో 56 మంది విద్యార్థులు గలరు. అయిన బాల బాలికల నిష్పత్తి కానిది క్రింది వాటిలో ఏది ?

#8. రెండు సంఖ్యల నిష్పత్తి 7:3 వాటి మొత్తము మరియు భేదంలకు గల నిష్పత్తి ?

#9. 3:4 మరియు 7:8 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 72:x అయిన 'x' విలువ ?

#10. రెండు సంఖ్యల నిష్పత్తి 1:2 వాటికి 7 కలుపగా నిష్పత్తి 3:5 గా మారిన వాటిలో కనిష్ట సంఖ్య ?

#11. ఒక సంచిలో 1రూ., 50పై. 25పై. నాణేల విలువల నిష్పత్తి 4:5:3 మరియు ఆ సంచిలోని మొత్తం నాణేలు 520 అయిన 50పై. నాణేలు ఎన్ని ?

#12. 11, 7, 3, 1 లలో ప్రతిదానికి ఏ కనిష్టసంఖ్యను కలిపిన వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి ?

#13. 0.08, 0.0072 ల అనుపాత మధ్యమం ?

#14. ఒక పటం యొక్క స్కేలు 1:50000 అని ఇవ్వబడినది. పటంలో రెండు పట్టణాల మధ్య దూరం 6సెం.మీ. ఉన్నచో వాటి మధ్యగల నిజదూరము (కి.మీ.లలో)

#15. 8మీ. ఎత్తు గల ఒక స్తంభం 10మీ. పొడవు గల నీడను ఏర్పరచినది. అదే సమయంలో అవే పరిస్థితుల వద్ద ఒక చెట్టు 40మీ. పొడవు గల నీడను ఏర్పరచిన ఆ చెట్టు ఎంత ?

#16. ఒక మైక్రోచిప్ పథకం (డిజైన్) యొక్క స్కేలు 40:1 గా ఉన్నది. నమూనాలో దాని పొడవు 18సెం.మీ. అయిన ఆ మైక్రోచిప్ యొక్క నిజమైన పొడవు ?

#17. 16 మంది ఒక గుంతను 10 రోజులలో త్రవ్వుతారు. వారు ఆ పని 4 రోజులు చేసిన తరువాత మిగిలిన పనిని 4 రోజుల లోనే చేయవలెనన్నా ఇంకనూ ఎంతమందికి అదనంగాకావాలి ?

#18. గత సంవత్సరం ఒక వస్తువు ధర రూ.40 ఈ సంవత్సరం దాని ధర రూ.50లకు పెరిగినది. ధరలో పెరుగుదల శాతం ?

#19. ఒక పాఠశాలలో వర్షంపడిన రోజున 150మంది విద్యార్థులకు గాను, 25మంది పాఠశాలకు రాలేదు. అయిన వచ్చిన విద్యార్థుల శాతం ?

#20. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి 10% పెరిగి ఎత్తు 30% తగ్గిన దాని వైశాల్యంలో మార్పు శాతం ?

#21. ఒక గృహయజమాని తన ఇంటి అద్దెకు ప్రతి సంవత్సరం 5% పెంచును. ప్రస్తుతం ఆ ఇంటి అద్దె రూ.2500 అయిన 2సం౹౹ల తరువాత ఆ ఇంటి అద్దె ఎంత ?

#22. ఒక వస్తువు ప్రకటన వెల రూ.5760. దాని పై 5% రుసుము ఇచ్చిన 10% నష్టం వచ్చును. కొన్నవెల ఎంత ?

#23. ఒక పౌడర్ డబ్బా వెల 14.5% వ్యాట్ తో కలిపి రూ.229 బిల్లు వేయబడినది. దాని అసలు వెల ?

#24. ఒక సెల్ ఫోన్ ను రూ.750లకు అమ్మటం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టం పొందెను. 5% లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ ను అమ్మవలసిన ధర ?

#25. కొంత వడ్డీరేటు పై రూ.6500లు 4సం౹౹లకు రూ.8840 అగును. అదే వడ్డీరేటు వంతున రూ.1600 ఎంతకాలంలో రూ.1816 మొత్తం ఆగును ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *