TET DSC TRT 2021 PSYCHOLOGY FRUSTRATION ౼ కుంఠనం
నిర్వచనాలు :-
*”మానవుని ఆశయం గానీ, అవసరం గానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంఠనం” ౼ గుడ్
*”కుంఠనం అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం” ౼ కరోల్
కుంఠనానికి కారణాలు :–
*వ్యక్తికి ఉన్న ప్రజ్ఞ, సహజసామర్ధ్యాలు స్థాయి కంటే ఎక్కువ లక్ష్యాన్ని పొంది ఉండటం
*ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకో(లే)కపోవడం
*ఇతరులతో సంబంధాలను నెలకొల్పుకోలేకపోవడం
*మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం
కుంఠనం ౼ పర్యవసానాలు:-
*కుంఠనం స్థాయిని బట్టి, కుంఠనం పొందే వ్యక్తి లక్షణాలను బట్టికుంఠనం పర్యవసానాలు అనేక రకాలుగా ఉంటాయి
*లక్ష్యాన్ని చేరడంలో ఏర్పడిన ఆటంకాల వల్ల కొన్నిసార్లు తాత్కాలిక కుంఠనం ఏర్పడవచ్చు తాత్కాలికంగా ఏర్పడిన కుంఠనం వల్ల వ్యక్తిలో పట్టుదల పెరిగి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి లక్ష్యాన్ని చేరవచ్చు
*కుంఠనం వల్ల వ్యక్తి ఏర్పరచుకొన్న లక్ష్యాన్ని విరమించుకువొచ్చు
*కుంఠనం వల్ల శారీరక, మానసిక అనారోగ్యానికి గురికావచ్చు
*కుంఠనం స్థాయి ఎక్కువగానూ, నిరంతరంగానూ ఉంటే ఆత్మహత్య ప్రయత్నం లేదా ఒక్కొక్కసారి ఆత్మహత్యను కూడా చేసుకోవచ్చు
*కుంఠనం వల్ల దౌర్జన్యానికి పాల్పడవచ్చ
*స్వైరకల్పనకు పాల్పడవచ్చు అంటే పగటికలలు కనడం
*చెప్పిందే చెప్పడం లేదా చేసిందే మళ్ళీ చేయడం
కుంఠనాన్ని ఎదుర్కోవడం :-
*శక్తికి మించి శ్రమించడం
*పనికి, విశ్రాంతికి మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవడం
*చేతకాని పనికి అంగీకారం తెలపక పోవడం
*నిజాయితీగా ఉండడం
*ఇతరుల సహాయo తీసుకోవడం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️