TET DSC TRT 2021 PSYCHOLOGY DEFENSIVE TACTICKS ౼ రక్షక తంత్రాలు

Spread the love

TET DSC TRT 2021 PSYCHOLOGY DEFENSIVE TACTICKS ౼ రక్షక తంత్రాలు

*సంఘర్షణలు ౼ కుంఠనాలు ౼ ఒత్తిడి ౼ మనో వ్యాకులత ౼ విషమయోజనం ౼ మానసిక రుగ్మత
*ఈ పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఫ్రాయిడ్
*సంఘర్షణల వల్ల కుంఠనాలు ఏర్పడతాయి. కుంఠనాల వల్ల ఒత్తిడి, ఒత్తిడి వల్ల మనో వ్యాకులత ఏర్పడుతుంది
*కుంఠనాల వల్ల ఏర్పడ్డ మనో వ్యాకులతను తగ్గించుకొనేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన, అచేతన ప్రక్రియలను రక్షక తంత్రాలు అంటారు
*ఇవి మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతాయి
*వ్యక్తి ఆహాన్ని పరిరక్షిస్తాయి. కాని ఇందులో ఆత్మ వంచన భావన దాగి ఉన్నది

1)ప్రేరక తారుమారు:-
తనలోని ప్రేరకాలను వ్యతిరేకమైన ప్రేరకాలను ఊహించుకొని పొందడం
*ఉపాధ్యాయుడు దండించిన తరువాత విద్యార్థిని పిలిచి నీవు బాధపడుతున్నావా? అంటే లోపల బాధగా ఉన్నా పైకి లేదు అని చెప్పడం

2)దమనం:-
బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలను, బలవంతంగా మరచిపోవటానికి చేసే ప్రయత్నం
*ప్రాథమిక రక్షక తంత్రం
*మిగిలిన రక్షక తంత్రాలకు ఆధారం
*దీనినే ప్రేరేపిత విస్మృతి అంటారు
*మానసిక నాడీ రుగ్మతలు కలిగిన వ్యక్తులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు
ఉదా:-

బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పులను మరిచి పోవడం

3)ప్రక్షేపణం:-
వ్యక్తి తన లోపాలను తీరని కోర్కెలను అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులను గానీ, వస్తులకు గానీ, వస్తువులకు గానీ ఆపాదించడం. తన తప్పులు, అపజయాలకు ఇతరులను బాధ్యులుగా చేయటం
*ఇతరుల తప్పులను భూతద్దంలో చూపించడంలాంటిది
*దమనం తరువాత ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం
*అడలేక మద్దెల మీద గోడు వంటిది
ఉదా:

*అవినీతి పరుడికి ప్రపంచమంతా అవినీతి మయంగా కనబడడం
*పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ అవడానికి అధ్యాపకులే కారణం అని చెప్పడం
*పరీక్ష పత్రం తప్పులు తడకలుగా ఉన్నదని అనడం
*ఆకర్షణలేని ఒక యువతి, పురుషుడు తన వెంట పడుతున్నాడని అనడం

4)హేతుకీకరణo:
లక్ష్య సాధనలో విఫలమయిన వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్ధించుకోవడం
ఉదా:-

*పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వలన లాభం లేదు అనడం
*మంత్రి పదవి దక్కని డాక్టర్ ఎమ్మెల్యే , రోగులే దైవాలుగా భావించాను, వారికి సేవ చేయడానికే నాకు సమయం లేదు అని చెప్పడం
*డేటింగ్ కు తిరస్కరించిన తన క్లాస్ మేట్ ను ఆమె అంత అందగత్తె కాదులే అని సమర్ధించుకోవడం
*అందని ద్రాక్ష పుల్లన
*తీయని నిమ్మపండు

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

INSTAGRAN Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *