TET DSC 2021 PSYCHOLOGISTS ROUSSEAU, PESTALOZZI, FROEBEL

Spread the love

TET DSC 2021 PSYCHOLOGISTS ROUSSEAU, PESTALOZZI, FROEBEL

ramramesh

ROUSSEAU ౼ రూసో :-
*విద్యాతత్వంలో విప్లవం తీసుకొని వచ్చినవాడు
*ఇతడు ఫ్రెంచి విదేశీయుడు
*ప్రాకృతిక వాదానికి మూల పురుషుడు
*ఎమిలి, సామాజిక ఒడంబడిక గ్రంథాల రచయిత
*రూసో రూపొందించిన ఆదర్శ విద్యార్థికి నమూనా “ఎమిలీ”
*విద్యా మనోవిజ్ఞానశాస్త్రంలో స్వయం ప్రేరణా పద్దతులను అనుభవం ద్వారా విద్య, క్రీడా విధాన పద్దతిని ప్రతిపాదించాడు.
*మానవులంతా జన్మతః మంచివారేనని, నాగరికత పట్టణవాసం వారిని మలినపరుస్తుందని ఇతని వాదం
*ప్రకృతిలోకి తిరిగి పోదాం అనేది ఇతని నినాదం

PESTALOZZI ౼ పెస్టాలజి :-
*ఇతడు స్విట్జర్లాండ్ దేశస్థుడు
*1805౼1825 మధ్య యెర్డన్ బోర్డింగ్ స్కూలులో తన విద్యా ప్రయోగాలను చేశాడు
*తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలని చెప్పాడు
*విద్యార్థి స్వయంగా అనుభవం ద్వారా విద్య నేర్చుకోవాలని చెప్పాడు
*సామూహికంగా కృత్యాలు నిర్వహించాలని చెప్పాడు. బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థి కేంద్రబిందువు
*ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం
*1780లో ‘ఈవెనింగ్ ఆఫ్ ఏ హెర్మెట్’ అనే గ్రంథాన్ని రచించాడు
*విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వారిలో పెస్టాలజి అగ్రగణ్యుడు
*పెస్టాలజి సిద్దాంతాలు విద్యామనోవిజ్ఞానశాస్త్రంలో వైయుక్తిక భేదాలు, సహజ సామర్ధ్యం పైన ప్రయోగాలకు దారితీశాయి

FROEBEL ౼ ఫ్రోబెల్:-
*ఇతడు ‘జర్మనీ’ దేశస్థుడు
*ఇతడు పెస్టాలజి సమకాలికుడు
*కిoడర్ గార్డెన్ అనే చిన్నపిల్లల పాఠశాల వ్యవస్థకు పితామహుడు
*1837లో ఇతడు స్థాపించిన “కిండర్ గార్డెన్ పాఠశాల” గా రూపొందింది
వీరి బోధనా పద్ధతులు :
ఎ)స్వయం వివర్తనం (Self unfolding)
బి)స్వయం ప్రకాశం (Self Expression)
సి)స్వయం బోధన (Self Teaching)
డి)బోధనలో బహుమతులను ప్రవేశపెట్టాడు
ఇ)క్రీడల ద్వారా నేర్చుకోవడం
ఎఫ్)సంగీతం ద్వారా అభ్యసనం
*”Play way” అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి
*ఫ్రోబెల్ ఉపాధ్యాయుడిని తోటమాలితో, విద్యార్థిని తోటలోని మొక్కతో పోల్చాడు

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

3 thoughts on “TET DSC 2021 PSYCHOLOGISTS ROUSSEAU, PESTALOZZI, FROEBEL”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *