TET DSC 2021 CONFLICTS ౼ సంఘర్షణ
నిర్వచనాలు :-
*సంఘర్షణ అనేది రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధా పూరితమైన ఉద్వేగస్థితి ౼ డగ్లస్ మరియు హాలె
*సంఘర్షణలు నాలుగు రకాలు ౼ కర్ట్ లెవిస్ ప్రకారం
1)ఉపగమ ౼ ఉపగమ : (Aproach & Aproach)
రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఏదో ఒక దానికి ఎన్నుకోవలసిన వచ్చినపుడు కలిగే సంఘర్షణ.
ఉదా:-
1)వైమానిక దళం ౼ వ్యక్తి ౼ నౌకాదళం
2)తెలిసిన జవాబు ౼ విద్యార్థి ౼ తెలిసిన జవాబు
3)ఒక వైపు Ice ౼ పిల్లవాడు ౼ మరొక వైపు చాక్లెట్
4)తల్లి ౼ నూతన వరుడు ౼ భార్య
2)పరిహార ౼ పరిహార : (Avoidence & Avoidence)
రెండు ఆకర్షణీయo కాని లక్ష్యాలలో ఏదో కటి ఎంచుకోవాల్సిన వచ్చినపుడు ఏర్పడే సంఘర్షణ
ఉదా:-
1)తెలియని జవాబు ౼ విద్యార్థి ౼ తెలియని జవాబు
2)Regain ౼ ఉద్యోగి ౼ Transfer
3)Match Practice చేయడం ఇష్టం లేదు ౼ ఆటగాడు ౼ ఓడిపోవడం ఇష్టం లేదు
3)ఉపగమ ౼ పరిహార : (Aproach & Avoidence)
ఆకర్షణీయమైన లక్ష్యం వైపు ఆకర్షితుడు అవుతాడు కాని సిగ్గు భయం, మరే ఇతర కారణాల వల్ల వికర్షితుడవుతాడు. ఇలాంటి సంఘర్షణను ఉపగమ ౼ పరిహార సంఘర్షణ అంటారు
ఉదా:-
1)జామపండు ౼ పిల్లవాడు ౼ కింద పడతానని భయం
2)సిగరెట్టు ౼ విద్యార్థి ౼ తాగితే క్యాన్సర్ వస్తుంది
4)ద్విఉపగమ పరిహార:(Dual aproach & Avoidence)
రెండు అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైన, ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరిగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ
ఉదా:-
జీతం ఎక్కువ ౼ వ్యక్తి ౼ దూరం ఎక్కువ
జీతం తక్కువ ౼ వ్యక్తి ౼ దూరం తక్కువ
సంఘర్షణలు ఏర్పడినప్పుడు వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైంది. ఎందుకంటే తీసుకొనే నిర్ణయాల పైనే. వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు గానీ, విపరీతమైన జాప్యంగానీ, వాయిదా వేయడంగానీ, సరికాదు. సంఘర్షణలు ఏర్పడినప్పుడు వాటిలో ఉన్న లోటుపాటులనూ అలాగే మనలో ఉన్న సామర్ధ్యాలను, పరిమితులను, ఆశక్తులనూ బేరిజువేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఉపాధ్యాయుల నిత్యజీవిత అనుభవాల ఆధారంగానూ, వివిధ ప్రాజెక్టులు, కృత్యాల ఆధారంగా సంఘర్షణలు ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యాన్ని పెంపొందించాలి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
Tanq sir