TET 2021 DSC 2021 PSYCHOLOGY CHILD REARING STYLES
1.సాధికారతత్వ పిల్లల పెంపక శైలి :
*ఇది బాగా విజయవంతమయిన శైలి
*ఈ శైలిలో పిల్లలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వటం, పిల్లల భావాలను, ఆలోచనలు స్వీకరించడం, వారితో భాగస్వాములు కావడం, అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలను ప్రదర్శించడం, పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండడం, పిల్లల అవసరాలకు తీర్చడం లాంటి ప్రవర్తనను కనుబరుస్తాయి
*ఈ రకంలో తల్లిదండ్రులలో ఆనందకరమైన, ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు ౼ తల్లిదండ్రుల మధ్య సంబంధాలను ఏర్పరుచుకుంటారు
2.నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి :
*తల్లిదండ్రుల పిల్లలను నియంత్రించడంలో బలవంతపు విధానాలు ఎక్కువగా ఉపయోగిస్తారు
*పిల్లలకు తక్కువ స్వేచ్ఛను ఇస్తారు
*తల్లిదండ్రుల పట్ల పిల్లలు తక్కువ ప్రేమను, తిరస్కారణ ధోరణిని కలిగి ఉంటారు
3.అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి :
*ఒక పద్దతి ప్రకారం పిల్లలకు స్వేచ్చనివ్వకుండా, నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు అధిక స్వేచ్ఛను ఇస్తారు
*వీరు పిల్లల పట్ల అవసరానికి మించి శ్రద్ధ చూపవచ్చు లేదా అసలు పట్టించుకోకపోవచ్చు
*పిల్లల ప్రవర్తన పై తక్కువ నియంత్రణ చూపుతారు
*వీరి పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పటం, అవిధేయత, తిరుగుబాటు ధోరణి కలిగి ఉంటారు
*అధిక సమాజ వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉంటారు
4.జోక్యరహిత పిల్లల పెంపక శైలి :
*తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశ్యాన్ని కలిగి ఉండరు
*పెంపకంలో ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు
*పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్యధోరణి కనుబరుస్తారు
*తల్లిదండ్రులు పిల్లలను తక్కువగా స్వీకరించడం జరుగుతుంది
*పిల్లల ప్రవర్తనను నియంత్రించకుండా పూర్తిగా వదిలేస్తారు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️