AP TET DSC 2021 MATHEMATICS (వ్యాపార గణితం) TEST౼10

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. ఒక ఇంటి యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 6% పెంచుతాడు. ప్రస్తుతం ఆ ఇంటిఅద్దె రూ.2500 అయిన 2సం౹౹ల తరువాత ఇంటి అద్దె ఎంత ? (రూ౹౹లలో)
2. రాము ఒక గడియారమును 12% లాభంనకు ఇబ్రహీంకు అమ్మెను. ఇబ్రహీం దానిని 5% నష్టమునకు కృష్ణకు అమ్మెను. కృష్ణ ఆ గడియారమును రూ. 1330 చెల్లించిన రాము ఆ గడియారమును ఎంతకు కొనెను ?
3. సౌమ్య అమ్మకపుపన్నుతో కలిపి ఒక ఫేస్ క్రీమ్ ను రూ.79.80 కు కొన్నది. దాని పై ముద్రిత ధర రూ.70 అయిన అమ్మకపు పన్ను ఎంత ?
4. నీలిమ బట్టలు కొనుటకు ఒక దుకాణమునకు వెళ్లినది. ఆమె ఎంచుకున్న దుస్తుల ప్రకటన వెల రూ.500 దుకాణదారుడు మొదట 20% తరువాత 5% రుసుము ఇచ్చెను అయిన ఆమెకు మొత్తం మీద ఎంతశాతం రుసుము లభించినదో కనుక్కోండి
5. 8:5 1/3 మరియు 3 1/5:1 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయిన x విలువ ఎంత ?
6. శక్తి దగ్గర ఉన్న కిడ్డీబ్యాంకులలో రూపాయినాణేలు, అర్ధరూపాయి నాణేలు గలవు. అర్ధరూపాయి నాణేల సంఖ్య రూపాయి నాణేల సంఖ్యకు 3రెట్లు. నాణేల మొత్తం విలువ రూ.35 అయిన 50పై నాణేలు ఎన్ని?
7. చక్రవడ్డీ ప్రకారం కొంతసొమ్ము 6సం౹౹లలో రెట్టింపు అగును. అయిన 21సం౹౹లకు ఎన్ని రెట్లు అగును ?
8. బారువడ్డీ ప్రకారం అసలు 8సం౹౹లకు రెట్టింపు అగును. అయిన ఎన్ని సం౹౹లకు అది 3రెట్లు అగును ?
9. సీత,లతల వార్షిక కుటుంబ ఆదాయాల నిష్పత్తి 4:3. వారి వార్షిక కుటుంబ ఖర్చుల నిష్పత్తి 3:2 వారు సం౹౹నకు ఒక్కొక్కరు రూ.3000చొప్పున నిల్వ చేసిన సీత యొక్క వార్షిక ఆదాయం ఎంత?
10. 10సం౹౹ల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. 10సం౹౹ల తరువాత తండ్రివయసు కొడుకు వయసుకు రెట్టింపు అయిన ప్రస్తుతం తండ్రి వయసు ఎంత ?
11. రెండు సంఖ్యలు 8:7 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటిసంఖ్యకు 8, రెండవ సంఖ్యకు 3 కలుపగా వాటి నిష్పత్తి 4:3 గా మారినది. అయితే ఆ సంఖ్యల మొత్తం
12. ఒక ఉద్యోగి తన జీవితంలో 25% ఆహారానికి, 20% ఇంటి అద్దెకు, 15% స్కూల్ ఫీజుకు, 10% బట్టలకు ఖర్చు చేసెను. అతనుచేసిన పొదుపు రూ.1500 అయిన అతని జీతం ఎంత?
13. ఒక వస్తువు ప్రకటన వెలను కొన్నవెల పై 20% అధికంగా ప్రకటించారు. 14% లాభం వచ్చుటకు దాని పై ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వవలెను ?
14. ఒక రైలు తన ప్రయాణ మార్గంలో 200మీ. పొడవైన ప్లాట్ ఫారమ్ ను 25సె.లలో మరియు 500మీ. పొడవైన ప్లాట్ ఫారమ్ 40సె.లలో దాటేను అయిన రైలు పొడవు
15. ఒక పైపు ఒక ట్యాoకును 10గం.లలో నింపును. మరొకవైపు 15గం.లలో ఖాళీ చేయును. రెండింటిని ఒకేసారి పనిచేయడం ప్రారంభించిన 6గం. ల తరువాత 2వ పైపును ఆపివేసిరి. అయిన ట్యాoక్ మొత్తం ఎంత కాలంలో నిండును?
16. 'ఎ'యొక్క సామర్థ్యం 'బి' కన్నా 50%ఎక్కువ. వారివరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని 'బి' ఒక్కడే పూర్తిచేయుటకు పట్టు కాలం? (రోజుల్లో)
17. ఎ, బి, సి లు ఒక పనికి రూ.2600 తీసుకొనిరి 'ఎ' 20రోజుల్లో, 'బి' 30 రోజుల్లోనూ, 'సి' 40 రోజుల్లోనూ ఆ పని పూర్తి చేశారు. అయిన 'బి' వాటా ?
18. ఇద్దరు స్త్రీలు మరియు 5గురు పురుషులు ఒక కుట్టు పనిని 4రోజుల్లో చేయగా ముగ్గురు స్త్రీలు మరియు 6గురు పురుషులు దానిని 3రోజుల్లో చేసేదరు. స్త్రీ ఒక్కరే ఆ పనిని పూర్తిచేయుటకు పట్టు కాలం?
19. 4సం౹౹లలో మొత్తం అసలుకు 4రెట్లు కావాలంటే వడ్డీరేటు ఎంత?
20. రూ.31250 లకు 8% చక్రవడ్డీ చొప్పున 2సం౹౹లకు అయ్యే వడ్డీ ?
21. కొంత సొమ్ము పై 2సం౹౹లకు 4% వడ్డీరేటున అయ్యే చక్రవడ్డీ రూ.510 అయిన అదే కాలానికి అయ్యే సాధారణ వడ్డీ?
22. రూ.10000 అసలు పై 10% వడ్డీరేటు చొప్పున 3సం౹౹ల కాలానికి బారు వడ్డీ, చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం ?
23. 35మంది విద్యార్థులకు 24రోజులకు భోజనాలకు అయ్యేఖర్చు రూ.6300 ఆయిన్ 25మంది విద్యార్థులకు 18రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు?
24. ఒక ఓడ గంటకు 16నాటికల్ మైళ్ళు వేగంతో కొంత దూరమును 10గం.లలో చేరగలదు. అదేదూరం 8గం.లలో చేరవలెనన్న ఎంత అధిక వేగంతో ప్రయాణం చేయాలి?
25. 15, 17, 9, 10లలో ప్రతి దానిలో ఏ కనిష్ట సంఖ్యను తీసి వేసిన వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి?

 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

2 thoughts on “AP TET DSC 2021 MATHEMATICS (వ్యాపార గణితం) TEST౼10”

  1. Good afternoon sir
    Can you pls upload telangana papers also

    Can we attend this tests
    Topic are same for telangana and apple.

    Can we follow this papers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *